News August 22, 2025

భూగర్భ జలాలు తగ్గడం మంచిది కాదు: కలెక్టర్

image

భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడం పర్యావరణానికి మంచిది కాదని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి శుక్రవారం అన్నారు. ప్రస్తుతం కృష్ణానది నుంచి కాల్వలన్నింటిలో నీరు విస్తృతంగా ప్రవహిస్తుందన్నారు. ఈ జలాలలో చెరువులను పూర్తిగా నింపాలన్నారు. ఏడాదిలోగా చెరువులు, పంట కాలువల కట్టలు భలోపేతం చేయాలన్నారు. అలాగే పూడికతీత పనులు వేగంగా చేయాలన్నారు.

Similar News

News January 18, 2026

ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>EdCIL<<>> APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/

News January 18, 2026

ఇంద్రకీలాద్రిపై వైభవంగా చండీ హోమం.. పోటెత్తిన భక్తులు!

image

అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో చండీ హోమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. యాగశాలలో జరిగిన ఈ విశేష హోమంలో 233 మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనగా, 91 మంది పరోక్షంగా ఆన్‌లైన్ సేవ ద్వారా భాగస్వాములయ్యారు.

News January 18, 2026

HYD మెట్రో.. త్వరలో సీఎం ముందుకు ఫైనాన్స్ రిపోర్ట్..?

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును సర్కారు స్వాధీనం చేసుకునే క్రమంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన ఆడిట్ పూర్తిచేసినట్లు సమాచారం. మరో పది రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సీఎం వద్దకు పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో రైల్ హక్కుల స్వాధీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏదేమైనా ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సర్కార్ భావిస్తోంది.