News August 15, 2025

భూగర్భ జలాల స్థాయిని పెంచేలా కృషి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో నీటి నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిపారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ వంటి అంశాలపై గురువారం సీఎం రాష్ట్రంలోని కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు. భూగర్భ జలాల స్థాయిని పెంచేలా కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News March 12, 2026

వరి పంట విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

వరి పంట ప్రస్తుతం నాటిన సమయాన్ని బట్టి ఈనిక, గింజ పాలుపోసుకునే దశ, పూత దశలో ఉంది. ఈ సమయంలో పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ పంట పూత దశలో ఉన్నట్లైతే నీటి ఎద్దడికి గురికాకుండా 2 అంగుళాల మేర నీరు ఉండేలా చూడాలి. పంట పిలక దశలో ఉంటే రెండో దఫాగా 45 kgల యూరియా వేయాలి. చిరుపొట్ట దశలో ఉన్న పొలాల్లో చివరి దఫా యూరియా 45KGలు+ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20kgలు వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 12, 2026

ప.గో: గ్యాస్ పై జేసీ కీలక సూచనలు

image

జిల్లాలో వంటగ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. బుధవారం గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వదంతులను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్‌ చేయవద్దని సూచించారు. సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

News March 12, 2026

తులసీ దళాలతో ఇలా చేస్తే..

image

ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి తులసి పరిహారాలు మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఎండిన 7 తులసి కొమ్మలను దారంతో కట్టి నెయ్యిలో ముంచి విష్ణుమూర్తి ముందు దీపం వెలిగిస్తే అదృష్టం వరిస్తుంది. ఎండిన ఆకులను గంగాజలంలో కలిపి ఇల్లంతా చల్లితే సానుకూలత పెరుగుతుంది. ఎండిన తులసి కొమ్మను ఎరుపు వస్త్రంలో చుట్టి పర్సులో ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయి’ అని సూచిస్తున్నారు.