News December 1, 2025

‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

image

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్‌తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.

Similar News

News February 18, 2026

SMలో ‘ఓవర్ షేరింగ్’ వద్దు.. ఈ విషయాలు పోస్ట్ చేస్తే డేంజర్!

image

SMలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్/ఆధార్, CVV, OTP వంటి కీలక విషయాలను షేర్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఐడెంటిటీ థెఫ్ట్‌కు దారితీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రైవసీని కాపాడుకోవడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ మోడ్స్ ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News February 18, 2026

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

image

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.

News February 18, 2026

ఎక్కువ సార్లు డకౌట్ అయింది వీరే

image

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్లు వీరే:
12- రోహిత్ శర్మ (151 ఇన్నింగ్సులు)
7- విరాట్ కోహ్లీ (117)
7- సంజూ శాంసన్ (50)
6- అభిషేక్ శర్మ (40)
6- సూర్య కుమార్ యాదవ్ (102)
5- అర్ష్‌దీప్ సింగ్ (28)
5- కేఎల్ రాహుల్ (68)