News November 19, 2025

భూపాలపల్లి: నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా

image

భూపాలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈరోజు సింగరేణి ఇల్లందు క్లబ్‌లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయింపునకు డ్రా పద్దతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొననున్నారు. లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయిస్తారు.

Similar News

News January 23, 2026

వర్సిటీల నిధులు, నియామకాలపై PUC ఛైర్మన్ సమీక్ష

image

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని PUC ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ-వ్యయాలు, పరిపాలనా పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా విద్యార్థుల మేలు కోసం వినియోగించాలన్నారు.

News January 23, 2026

ఈనెల 25 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు!

image

మేడారం మహాజాతర భక్తుల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు 290 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు హనుమకొండ డీఎం ధాంసింగ్ తెలిపారు. వరంగల్‌ తాత్కాలిక బస్‌ పాయింట్‌ నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 కాగా, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే, అగ్రహంపాడు జాతరకు కూరగాయల మార్కెట్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.

News January 23, 2026

భూమనపై రమణ విమర్శలు

image

విజయసాయిరెడ్డి నమ్మినవారికి వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడని, దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని టీటీడీ మాజీ సభ్యుడు ఓ.వి.రమణ ఆరోపించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. భూమన కరుణాకర్ రెడ్డి కరుణానంద స్వామిలా మారి శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి YCPకి రాజీనామా చేయడం జగన్ ఆడుతున్న డ్రామా అని, BJPలో చేరి కూటమిని విచ్ఛిన్నం చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.