News March 5, 2025

భూపాలపల్లి: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డ కేసులో మంగళవారం నిందితుడు అట్టెం మల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానాను విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.నారాయణబాబు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో జిల్లా స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ రావు వాదనలు వినిపించగా పోలీసులు సాక్షాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్ష పడింది.

Similar News

News December 5, 2025

CEOలనూ AI వదలదు: రచయిత స్టువర్ట్

image

ఫ్యూచర్‌లో CEO ఉద్యోగాలనూ AI లాగేసుకునే ఛాన్స్ ఉందని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ మోడ్రన్ అప్రోచ్’ పుస్తక సహ రచయిత స్టువర్ట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు. AIకి నిర్ణయాధికారం ఇవ్వాలని లేదంటే తప్పుకోవాలని బోర్డు సభ్యులు CEOను డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. పని అనుకునే ప్రతి దాన్నీ AI చేసేస్తోందన్నారు. ఇప్పటికే కార్మికులు, డ్రైవర్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు నష్టపోతున్నామనే చర్చ జరుగుతోంది.

News December 5, 2025

ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 5, 2025

డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

image

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం