News September 11, 2025
భూపాలపల్లి: భారీ వర్షాలతో 852 ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 852 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని DAO బాబురావు తెలిపారు. గోదావరి బ్యాక్‌వాటర్, వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. మహదేవపూర్ మండలంలో అత్యధికంగా 745.83 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, కాటారం, పలిమెల, ఘనపూర్ మండలాల్లోనూ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు.
Similar News
News December 5, 2025
జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవం

జగిత్యాల జిల్లాలో నలుగురు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ప్రకటించారు. మెట్ పల్లి మండలం చింతల్ పెట్ గ్రామ సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య, ఇబ్రహీంపట్నం మండలం యామపూర్ సర్పంచ్‌గా కనుక నగేష్, మూలరాంపూర్ సర్పంచ్‌గా కనుగంటి లాస్య ప్రియ, కథలాపూర్ మండలం రాజారాం తండ సర్పంచ్‌గా భుఖ్య తిరుపతి ఎన్నికైనట్లు పేర్కొన్నారు.
News December 5, 2025
ఖమ్మం: గంజాయి నిందితులకు జైలు శిక్ష

గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మం-వరంగల్ క్రాస్ రోడ్డుతో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ 2022 ఏప్రిల్ 10, 2024 జనవరి 10న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరచారు. ఒక్కొక్కరికి 20, 10 సం.ల జైలు శిక్షలతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు.