News November 30, 2025
భూపాలపల్లి: రెండో విడతలో సర్పంచ్ పదవికి 42 నామినేషన్లు

భూపాలపల్లి జిల్లాలో రెండో విడతలో ఎలక్షన్లు జరుగుతున్న నాలుగు మండలాల్లో 85 పంచాయితీలలో సర్పంచ్ పదవి కోసం 42, 694 వార్డులకు గాను 28 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చిట్యాల మండలంలో 26 పంచాయితీలకు 20 నామినేషన్లు, భూపాలపల్లి మండలంలో 26 పంచాయితీలు, టేకుమట్ల మండలంలో 25 పంచాయతీలు, పలిమెల మండలంలో 8 పంచాయితీలకు మూడు నామినేషన్లు వచ్చాయి.
Similar News
News February 15, 2026
రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.
News February 15, 2026
చల్లని నీరు Vs వేడి నీరు.. స్నానానికి ఏది బెటర్!

స్నానానికి వేడి నీరు బెటరా? చల్లని నీరు మేలా? అంటే రెండూ మంచివేనంటున్నారు నిపుణులు. చల్లటి నీటితో ఇమ్యూనిటీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. వేడి నీళ్లతో కండరాలు రిలాక్స్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిద్ర ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఉదయం చల్లటి నీళ్లు, రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.
News February 15, 2026
KRI: ఆవుల కోసం గోశాలలు.. ప్రజలకు ఉపశమనం

ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రోడ్లపై తిరిగే ఆవుల కోసం గోశాలలు నిర్మించనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. షెడ్ల నిర్మాణానికి ఒక్కో మున్సిపాలిటీకి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో శనివారం ప్రకటించారు. గుడివాడ, ఉయ్యూరు, పెడన, తాడిగడప, మచిలీపట్నం, విజయవాడ, జగ్గయ్యపేట, కొండపల్లి ప్రాంతాల్లో షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


