News September 13, 2025
భూపాలపల్లి 6వ గనిలో ప్రమాదం

భూపాలపల్లిలోని సింగరేణి 6వ గనిలో విధులు నిర్వహిస్తున్న ఆర్ మొండయ్య(కోల్ కట్టర్)కు ప్రమాదం జరిగింది. రోజు విధుల్లో భాగంగా లోపలికి దిగి విధులు నిర్వహిస్తుండగా పైన ఉన్న రూఫ్ కూలి మీద పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కార్మికుడికి ఎడమ కాలు, ఎడమ చేయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు, అధికారులు భూపాలపల్లి సింగరేణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.
Similar News
News December 16, 2025
విశాఖ: వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి బంగారం చోరీ

ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి ధారపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున బంగారమ్మ తల్లి లేఔట్‌లో నివసిస్తున్న వసంత (66) అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా సుమారు ఇంట్లోకి దొంగలు చొరపడ్డారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న సుమారు 10 తులాల బంగారం, 8 తులాల వెండి దోచుకుని పరార్ అయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆరిలోవ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News December 16, 2025
హనుమకొండలో ఎన్నికలకు సర్వం సిద్ధం

జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆత్మకూరు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా సందర్శించి, పోలింగ్ సామగ్రి పంపిణీని, సిబ్బంది రిపోర్టింగ్‌ను పర్యవేక్షించారు. ఈ విడతలో ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని 67 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
News December 16, 2025
సరిహద్దుల్లో కంచె నిర్మాణం.. ఎంత పూర్తయిందంటే?

దేశ భద్రతను పటిష్ఠం చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దుల వెంట కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ దీని వివరాలు వెల్లడించారు. ఇండియా-పాక్ 93.25% (2,135KMS), IND-బంగ్లాదేశ్ సరిహద్దులో 79.08% (3,239KMS) మేర కంచె నిర్మాణం పూర్తయిందన్నారు. IND-మయన్మార్ సరిహద్దులో 1,643 కి.మీల మేర పనులు జరుగుతున్నాయన్నారు.


