News August 12, 2025

భైంసా: ‘గుండె చూపించి.. రక్తప్రసరణ వ్యవస్థ వివరించి’

image

భైంసా బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు తానాజీ పదో తరగతి విద్యార్థులకు క్షీరదాలలో గుండె నిర్మాణం అనే పాఠ్యాంశంపై ప్రత్యక్షంగా వివరించారు. మేక గుండె ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె పనితీరుపైన ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చూయించి వివరించారు. విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనతోనే మేలైన అభ్యసన జరుగుతుందని పాఠశాల HM గంగాప్రసాద్ అన్నారు. టీచర్ తానాజీని ఆయన అభినందించారు.

Similar News

News March 14, 2026

మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

image

నందిగరువులో నిర్వహించిన మాటా మంతీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు విని కొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అందుకే నేరుగా వచ్చి సమస్యల వింటున్నామన్నారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుతో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని, తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు.

News March 14, 2026

GWL: సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

image

గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీసు, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సమస్యల తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లుకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు.

News March 14, 2026

కోదాడలో 42 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

image

కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను శ్లోక గ్యాస్ గోదాముకు తరలించారు.