News August 22, 2025

భైంసా: బెట్టింగ్ రాయుడి ఇంట్లో పోలీసుల సోదాలు

image

భైంసా పట్టణంలోని ఒవైసీ నగర్‌లోని ఓ బెట్టింగ్ రాయుడి ఇంట్లో గురువారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. క్రికెట్ మ్యాచ్ స్లాట్లు, పందెలు నిర్వహిస్తున్న సమాచారం రావడంతో ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. అతని నుంచి భారీగా నగదు, ఫోన్లు, పందెల రికార్డులు, స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 21, 2026

జీవీఎంసీ సేవలకు సహకరించండి: కమిషనర్

image

​విశాఖ నగర అభివృద్ధి, స్వచ్ఛ సర్వేక్షన్‌-2025లో ఉత్తమ ర్యాంకు సాధనకు నివాసిత సంక్షేమ సంఘాలు (RWAs) సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. బుధవారం జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు రోడ్లు, డ్రైనేజీ, పార్కుల సమస్యలను ప్రస్తావించారు. సమస్యల తక్షణ పరిష్కారానికి ‘పురమిత్ర’ యాప్ టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలన్నారు. కాలనీల్లోని పార్కుల నిర్వహణ బాధ్యతను సంఘాలే తీసుకోవాలని సూచించారు.

News January 21, 2026

నాగిరెడ్డిపేట్ అటవీ రేంజ్‌లో వన్యప్రాణుల గణన

image

నాగిరెడ్డిపేట్ అటవీ రేంజ్ పరిధిలో బుధవారం వన్యప్రాణుల గణన నిర్వహించినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాసుదేవరావు తెలిపారు. జాతీయ పులుల గణనలో భాగంగా ధర్మారెడ్డి రేంజ్ పరిధిలో మాంసాహార, శాఖాహార వన్యప్రాణుల పాదముద్రలు, ఆనవాళ్ల ఆధారంగా గణన చేపట్టారు. వన్యప్రాణుల పాదముద్రలు, ఆనవాళ్లను గుర్తించి నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బందితో పాటు YLR ప్రభుత్వ డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.

News January 21, 2026

KMR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 9,059 మంది విద్యార్థులు కేటాయించగా వారిలో 8,750 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 309 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు.