News September 6, 2024

భోగాపురం పనులు వేగవంతం: కేంద్రమంత్రి

image

ఉత్తరాంధ్రకు ఎంతో ముఖ్యమైన భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను శుక్రవారం కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
విమానాశ్రయ టర్మినల్ భవనం, అప్రోచ్ రహదారుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష చేశారు.
ప్రపంచంలో అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని, 2026 జూలై కల్లా విమాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొనివస్తామని మంత్రి తెలిపారు.

Similar News

News October 4, 2024

2047నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్

image

స్వర్ణాంధ్ర-2047 సాధనకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. జిల్లాలో ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా వృద్ధి చెందడానికి తగిన సూచనలు సేకరణకు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టరేట్‌‌లో జేసీతో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2047 నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవాలని, ఇందుకు అందరి సహకారం అవసరమన్నారు.

News October 3, 2024

శ్రీకాకుళం: ల్యాబ్ టెక్నీషియన్స్ ఎన్నిక ఏకగ్రీవం

image

జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా జె.కేశవరావు, బి.అప్పలరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని జిల్లాలోని ఆయా పీహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు ఎన్నుకున్నారు. ట్రెజరీగా విజయ్ కుమార్, అసోసియేటివ్ ప్రెసిడెంట్‌గా లూసీ ఎస్టర్, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

News October 3, 2024

శ్రీకాకుళం: ఈనెల 7నుంచి బస్సు పాసుల మంజూరు

image

విద్యార్థులకు ఈనెల 7 నుంచి RTC బస్ పాసులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి విజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి కోసం విద్యాసంస్థ నుంచి స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్‌లతో apsrtcpass.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్లలో గల కౌంటర్ల వద్ద పాసులు పొందవచ్చని అధికారి పేర్కొన్నారు. share it.