News March 25, 2025
మంగళగిరి: ప్రజా క్షేత్రంలో కనిపించని ఆర్కే

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే YCP నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి RK నియోజకవర్గంలో అందుబాటులో లేరు. కనీసం కార్యకర్తలకు, అనుచరులకు సైతం కనిపించకపోవడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. చివరి ఎన్నికల్లో YCP తరపున పోటీ చేసిన మురుగుడు లావణ్య, కాండ్రు కమల ప్రజా క్షేత్రంలో కనిపించకపోవడం గమనార్హం.
Similar News
News April 19, 2025
కొల్లిపర: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్లిపర మండలం బొమ్మువారిపాలెంలో జరిగింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో విద్యార్థిని స్వీటీ(16) ఉత్తీర్ణత సాధించింది. అయితే తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
News April 19, 2025
గుంటూరు: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల జోరు

జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఏపీ నుంచి జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి ఫిమేల్ కేటగిరీలో దేశస్థాయిలో టాపర్‌గా నిలిచింది. ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకుతో మెరిసింది. మొత్తం 100లోపు 16 మంది, 200లోపు 28, 500లోపు 60, 1000లోపు 82 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని శనివారం గుంటూరులో భాష్యం ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. 73.24% సక్సెస్ రేటు సాధించామన్నారు.
News April 19, 2025
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.