News November 19, 2025
మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Similar News
News January 17, 2026
ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News January 17, 2026
వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.
News January 17, 2026
GNT: కలెక్టర్‌ని కలిసిన జీఎంసీ కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను కలిశారు. కార్పొరేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కమిషనర్ కలెక్టర్‌ని కలిసి ఆమెకు మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ది, ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.


