News April 25, 2024

మంగళగిరి వైసీపీ షాక్.. అభ్యర్థి పేరుతో మరో మహిళ నామినేషన్

image

మంగళగిరి వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పేరును పోలిన మరో మహిళ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో రాజకుమారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థి పేరుతోనే ఉన్న మరో మహిళ నామినేషన్ వేయడంతో వైసీపీ వర్గాల్లో అలజడి మొదలైంది. అయితే స్వతంత్ర అభ్యర్థి లావణ్యతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.

Similar News

News April 16, 2026

GNT: కూలీ కూతురు 990 మార్కులతో ప్రతిభ

image

గుంటూరు (D) రేవేంద్రపాడు కొత్తపాలెంకు చెందిన పుప్పాల కనకమహాలక్ష్మి పేదరికాన్ని జయించి ఆదర్శంగా నిలిచింది. కూలీ పనులకు వెళ్లే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో చదివిన ఆమె, ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. మల్లె తోటలో కూలీకి వెళ్లే తల్లి, బస్తాలు మోసే తండ్రికి తన విజయంతో తీపి కబురు అందించింది. ఆమె కృషిని గ్రామస్థులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలం: JDA

image

గుంటూరు జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జె.డి.ఎ. పద్మావతి స్పష్టం చేశారు. యూరియా, డి.ఏ.పీ, తదితర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు డీలర్ల సమావేశంలో వెల్లడించారు. బ్లాక్ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పోలీస్, రెవెన్యూ శాఖలతో కలిసి ప్రత్యేక నిఘా పెట్టినట్లు హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందకుండా సాగుకు సిద్ధం కావాలని సూచించారు.