News December 1, 2025
మంగినపూడి బీచ్‌లో రూ.157.53కోట్లతో ‘మైరా బే వ్యూ రిసార్ట్స్’

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన మైరా బే వ్యూ రిసార్ట్స్ ముందుకు వచ్చింది. NEW టూరిజం పాలసీలో భాగంగా తాళ్లపాలెంలో రూ.157.53కోట్లతో లార్జ్ అమ్యూజ్మెంట్ పార్క్ కం రిసార్ట్‌ను 20 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. అమ్యూజ్మెంట్ పార్క్‌తోపాటు వాటర్ పార్క్&రైడ్‌లు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్, వెల్‌నెస్ స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News February 19, 2026
భారత్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం: బంగ్లా మంత్రి

T20 WC నేపథ్యంలో భారత్‌తో నెలకొన్న <<19153853>>సమస్యను<<>> చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ స్పోర్ట్స్ మినిస్టర్ అమినుల్ హక్ తెలిపారు. ‘నేను ఇండియా డిప్యూటీ కమిషనర్‌తో T20 WC ఇష్యూపై మాట్లాడా. మేం పొరుగు దేశాలతో క్రీడలతో సహా అన్ని రంగాల్లో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్నాం. దౌత్యపరమైన సమస్యలపై ముందే చర్చించి ఉంటే మా జట్టు WCలో ఆడి ఉండేది’ అని హక్ పేర్కొన్నారు.
News February 19, 2026
మెదక్: విషాదం.. యువకుడి Suicide

చిలిపిచేడ్ మండలంలోని శిలాంపల్లి గ్రామంలో మన్నే సుధాకర్ (20) అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మంగళవారం గడ్డిమందు తాగగా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు.
News February 19, 2026
NTR: PPP విధానంలో రోడ్లు.. ఇదెక్కడి కర్మ!

విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 19 రోడ్లను PPP మోడల్లో నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించారు. 23.54 KM విస్తీర్ణంలో సర్కిల్-3లో 9, C-2లో 5, C-1లో 5 రోడ్లు వేయనున్నారు. బడ్జెట్ రూ.151Cr కాగా, 10 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులే వీటిని నిర్వహించనున్నారు. VMC వార్షిక బడ్జెట్ రూ.1643 కోట్లు ఉండగా, రోడ్లు కూడా కార్పొరేషన్ వేయకుండా, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


