News January 30, 2025
మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ : కలెక్టర్

మంచిర్యాల జిల్లాలో మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల, 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు.
Similar News
News February 14, 2025
విశ్వక్‌సేన్ ‘లైలా’ పబ్లిక్ టాక్

విడుదలకు ముందే రాజకీయ వివాదాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ‘లైలా’ సినిమా ప్రీమియర్ షోలు USలో ప్రారంభమయ్యాయి. సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టారని, సినిమా అంతా వన్ మ్యాన్ షో అని ప్రశంసిస్తున్నారు. అయితే స్టోరీ ఔట్‌డేటెడ్ అని, ఇంట్రెస్టింగ్ సీన్లు లేవని కొందరు పెదవి విరుస్తున్నారు. పూర్తి రివ్యూ, రేటింగ్ మరికొన్ని గంటల్లో..
News February 14, 2025
భద్రాద్రి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు

ఇతర రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాద్రి జిల్లాకు ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతి అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అశ్వరావుపేట, దమ్మపేట మండలం అల్లిపల్లి, చర్ల మండలం తేగడ వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
News February 14, 2025
ఖమ్మం ప్రధాన రహదారులు.. రక్తసిక్తం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినీ మేడారం జాతర, పలు మండలాల్లో ఆలయాల మహోత్సవాలతో గురువారం ఖమ్మం జిల్లాలో జనాల తాకిడి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు పదుల సంఖ్యలో దుర్మరణం చెందారు. అలాగే పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అకాల ప్రమాదాలతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.