News August 12, 2025
మంచిర్యాల: జిల్లావ్యాప్తంగా 14.4మి.మీ వర్షపాతం

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా సోమవారం 14.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా భీమినిలో 57.4 మి.మీ, అత్యల్పంగా దండేపల్లి, భీమారంలో సున్నా వర్షపాతం నమోదైంది. తాండూరులో 36.2, బెల్లంపల్లి 30.0, మంచిర్యాల 28.6, జైపూర్‌లో 23.4, మందమర్రిలో 21.4, కాసిపేటలో 17.6, జన్నారం 1.2, లక్షెట్టిపేట 11.0, హాజీపూర్ 1.4, కన్నెపల్లి 9.6, వేమనపల్లి 2.0, నెన్నెల 3.2 మి.మీగా రికార్డయింది.
Similar News
News March 14, 2026
గద్వాల: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు: కలెక్టర్

జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలు కానున్నాయి. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News March 14, 2026
కర్నూలులో 397 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 397 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,522 మందికి గాను 5,125 మంది మాత్రమే హాజరైనట్లు RIO లాలప్ప తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచామని, జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాశారని ఆయన వెల్లడించారు.
News March 14, 2026
నాయుడుపేట: అదృష్టమంటే ఆమెదే మరి..!

చోరీకి గురైన వడ్డానం కొరియర్‌లో బాధితురాలు ఇంటికి చేరింది. నాయుడుపేట మండలం పండ్లూరు సమీపంలోని ఓ హోటల్లో ఇటీవల వేడుక జరిగింది. రేణిగుంట ప్రాంతానికి చెందిన శిల్ప అనే మహిళ హాజరైంది. ఆమె 16 సవర్ల వడ్డాణం చోరీకి గురైంది. బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వడ్డాణం బాధితురాలు ఇంటికి కొరియర్‌లో వచ్చింది.


