News September 12, 2025
మంచిర్యాల జిల్లా వర్షపాతం వివరాలు

గడచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 15.9మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా చెన్నూరలో 57.6 MM నమోదు కాగా.. కోటపల్లిలో 52, జన్నారం11.4, దండేపల్లి8.2, లక్షెట్టిపేట22.2, హాజీపూర్22.4, కాసీపేట 2.2, తాండూర్ 2.4, భీమిని1.8, కన్నెపల్లి9.4, వేమనపల్లి8.2, నెన్నల4.2, బెల్లంపల్లి 4.6, మందమర్రి7.8, మంచిర్యాల 18.8, నస్పూర్ 20, జైపూర్ 15.8, భీమారంలో 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Similar News
News December 9, 2025
కడప జిల్లా SP కీలక సూచన.!

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
News December 9, 2025
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.
News December 9, 2025
ఆసిఫాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


