News March 16, 2025
మంచిర్యాల: పలు పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఈఆర్ఓలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో పార్టీల ప్రతినిధులు సహకరించాలని, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. 2, 3 ఎపిక్ కార్డులు కలిగి ఉంటే వాటిని తొలగించాలన్నారు.
Similar News
News February 17, 2026
మొగళ్లమూరు: ఆస్తి రాసిస్తే అనాథను చేసింది

మొగళ్లమూరుకు చెందిన వాసర్ల లక్ష్మి సోమవారం కలెక్టరేట్‌లో తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్తి రాసిచ్చిన తర్వాత పెంపుడు కుమార్తె తనను నిర్లక్ష్యం చేస్తూ, మానసిక వేధింపులకు గురిచేస్తోందని కలెక్టర్‌కు విన్నవించారు. భర్త మృతితో ఒంటరినైన తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కుమార్తె పేరిట చేసిన రెండున్నర ఎకరాల దానసెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఆస్తిని తిరిగి ఇప్పించాలని ఆమె వేడుకున్నారు.
News February 17, 2026
కర్తరీ దోషం అంటే ఏమిటి?

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.
News February 17, 2026
మామిడి పంట.. ఈ దశలో పోషకాలు అందించండి

మామిడి పిందెలు బఠాణీ లేదా గోళీకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లకు మరోసారి పోషకాలను అందించాలంటున్నారు నిపుణులు. ఈ దశలో లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10-15 గ్రా., యూరియా లీటరు నీటికి 10 గ్రా. మరియు అర్కమ్యాంగో స్పెషల్ లీటరు నీటికి 5గ్రా. లేదా ఫార్ములా-4 లీటరు నీటికి 2.5గ్రా సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుకు వచ్చి అధిక బరువు పెరుగుతాయి.


