News December 21, 2024
మంచిర్యాల: బస్టాండ్ శుభ్రం చేయాలని మందుబాబులకు శిక్ష
ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఈనెల 18న కోర్టులో హాజరు పర్చగా 2వ అదనపు మెజిస్ట్రేట్ మంచిర్యాల బస్టాండను 5 రోజుల (ఈనెల 20 నుంచి 24) వరకు శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇది ఇలా ఉండగా మరో 22మందిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా 14మందిని 5రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు నిర్వర్తించాలని, మిగతా వారికి రూ.17500/-జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B.సత్యనారాయణ తెలిపారు.
Similar News
News January 13, 2025
సిర్పూర్(టి): పశువుల రవాణా.. ముగ్గురి ARREST
అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోశాలలకు తరలించి, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
News January 13, 2025
కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్‌లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
News January 13, 2025
సెపక్ తక్రా జాతీయస్థాయి పోటీల మేనేజర్లుగా గోలేటివాసులు
రెబ్బన మండలం గోలేటికి చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సీనియర్ సెపక్ తక్రా మేనేజర్లుగా ఎంపికయ్యారు. ఆదివారం గోలేటిలో తెలంగాణ రాష్ట్ర సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 10నుంచి 14వరకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 34వ సీనియర్ జాతీయస్థాయి మహిళల టీం మేనేజర్‌గా పర్లపల్లి శిరీష, పురుషుల మేనేజర్‌గా రామకృష్ణారెడ్డి ఈనెల 11న ఎంపికయ్యారని తెలిపారు.