News October 6, 2025
మంచిర్యాల: రైతులు కపాస్ కిసాన్ యాప్ వినియోగించాలి

జిల్లాలోని రైతులు పత్తి విక్రయించేందుకు కపాస్ కిసాన్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్లాట్ బుకింగ్‌పై అవగాహన కల్పంచాలన్నారు. పత్తిలో తేమ 12% కంటే తక్కువగా ఉండాలని, నాణ్యతలేని, రంగు మారిన, వర్షానికి తడిసిన పత్తిని కొనుగోలు చేయమని, విడి పత్తిని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తేవాలని వివరించారు.
Similar News
News January 19, 2026
సంగారెడ్డి: నేటి నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 19 నుంచి మార్చి 8 వరకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. బైపాస్ రహదారిలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాచ్‌కు 100 మంది చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
News January 19, 2026
ఘోర పరాభవం

2024లో న్యూజిలాండ్‌పై స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ ఇండియా తాజాగా తొలి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోని భారత జట్టు తాజా ఓటమితో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇక ఇండోర్ వేదికలో ఆడిన 8 మ్యాచుల్లో భారత్‌కిదే తొలి ఓటమి కావడం గమనార్హం.
News January 19, 2026
HYD: TDR అంటే ఏమిటి..? ఎందుకు ముఖ్యం..?

ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR) అనేది ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే ఓ అదనపు నిర్మాణ హక్కు. చెరువుల FTL, బఫర్ జోన్లు లేదా రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన రైతులకు/ యజమానులకు నగదుకు బదులుగా ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. అలాగే యజమానులు ఆ హక్కులను వేరే చోట అదనపు అంతస్తుల కోసం వాడుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇది పర్యావరణ పరిరక్షణకు, మౌలిక సదుపాయాల కల్పనకు కీలకం.


