News December 1, 2025
మంచిర్యాల: 9వ తరగతి విద్యార్థి మృతి

జైపూర్ మం. ఎల్కంటిలో విషాదం నెలకొంది. రెడ్డి జాగృతి అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కుమారుడు భరత్ రెడ్డి (9వ తరగతి) చికిత్స పొందుతూ మరణించాడు. వరంగల్‌లోని ఓ స్కూల్‌లో చదువుతున్న భరత్‌రెడ్డికి ఇటీవల జరిగిన పోటీల్లో పాల్గొనగా చేతికి గాయమైంది. శనివారం MNCL ఆసుపత్రికి తీసుకురాగా, రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు నిర్ధారించి KNR కు రిఫర్ చేశారు. అక్కడి నుంచి HYD తరలించే క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Similar News
News February 10, 2026
తప్పులు సరిదిద్దేందుకు రీసర్వే 2.0: కలెక్టర్

జిల్లాలో రీసర్వే 2.0ను నిర్వహించడానికి మండలాల వారీగా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారం, శాశ్వత భూ హక్కుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రీసర్వేలో దొర్లిన తప్పులు సరిదిద్దేందుకు రీసర్వే 2.0ను తీసుకొచ్చిందన్నారు.
News February 10, 2026
NRPT: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియలో మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసినట్లు నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు సెలవును సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News February 10, 2026
గన్నవరం: సచివాలయ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

గన్నవరం మండలం కొండపావులూరులో స్థానిక సచివాలయ మహిళా కానిస్టేబుల్ లలిత ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


