News February 11, 2025
మంచిర్యాల ATC, ITI కళాశాల పనుల పరిశీలించిన అధికారులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాల ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మిస్తున్నారు. దీనితో పాటు ITI కళాశాలను TGNPDCL ఛైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి, ఉపాధి శిక్షణ సంస్థ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సీతారామయ్యలతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆధునిక సాంకేతికత సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
చైనా రోబో డాగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన గల్గోటియాస్

చైనా <<19173893>>రోబో డాగ్<<>> తమ ఆవిష్కరణగా చెప్పుకుని విమర్శలపాలైన గల్గోటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు తెలిపింది. ‘రోబో డాగ్ సాంకేతిక మూలాల గురించి మా ప్రతినిధికి తెలియదు. కెమెరా ఎదుట ఉత్సాహంతో తప్పుడు సమాచారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణపై తప్పుదోవ పట్టించడం మా ఉద్దేశం కాదని అర్థం చేసుకోగలరు. నిర్వాహకుల మనోభావాలను అర్థం చేసుకుని మేం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేశాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది.
News February 19, 2026
ఛత్రపతి: వీరత్వ పతాక.. ధీరత్వ ప్రతీక

శివాజీ చక్రవర్తి.. ఈ పేరు వింటే శత్రువులపై విరుచుకుపడిన వీరత్వం, రాజ్యాలను జయించిన ధీరత్వం గుర్తొస్తాయి. మొఘలులు, దక్కన్ సుల్తానుల మధ్య నలిగే ప్రజలకు విముక్తి కలగాలన్న తల్లి జిజియాబాయి మాటలతో రాజ్య స్థాపనపై బాల్యంలోనే కలగన్నారు. తల్లి నేర్పిన పురాణ గాథల బోధనల బుద్ధితో పాటు యుద్ధ విద్యలతో పరాయి పాలనలోని కోటలను బద్దలు కొట్టి మహారాష్ట్రలో మరాఠా జెండా ఎగురవేశారు. ఆ ఛత్రపతి జయంతి నేడు (19 feb 1630).
News February 19, 2026
హౌసింగ్ సమస్యలపై ‘ఫోన్-ఇన్’ కార్యక్రమం

కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ లబ్ధిదారుల సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు హౌసింగ్ పీడీ చిరంజీవి తెలిపారు. సిమెంట్, స్టీల్ సరఫరా, నిర్మాణ బిల్లులు మరియు PMAY 2.0 Urban ఇళ్లకు సంబంధించిన వివరాల కోసం ప్రతి గురువారం ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
★ సంప్రదించాల్సిన నంబర్: 08518-257481


