News March 12, 2025
మంచిర్యాల: HMపై పోక్సో కేసు: CI

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేసినందుకు ఈనెల 5న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదైంది.
Similar News
News February 9, 2026
అనంత: 40 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!

గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1983-86 బ్యాచ్ బీకాం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు తమ పాత అధ్యాపకులను సన్మానించారు. కళాశాల అభివృద్ధి కోసం రూ.లక్ష విరాళం ప్రకటించి, ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్యకు అందజేశారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
News February 9, 2026
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి. లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 9, 2026
కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఫీజులు పెంపు

దేశంలోని కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదుల ఫీజును న్యాయశాఖ పెంచింది. రెగ్యులర్ అప్పీళ్లకు హాజరై, తుది విచారణ వరకు వాదనలు వినిపించే గ్రూప్-ఏ న్యాయవాదులకు ఒక కేసుకు ఫీజు రూ.13,500 ఉండగా రూ.21,600 చెల్లించనుంది. గ్రూప్-బీ, సీ న్యాయవాదులకు రూ.9వేల నుంచి రూ.14,400 ఇవ్వనుంది. 11 ఏళ్ల తర్వాత ఈ ఫీజులు పెంచడం గమనార్హం.


