News February 10, 2025
మంచిర్యాల RTC బస్టాండ్‌లో ప్రమాదం

మంచిర్యాలలోని RTC బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రయాణికుడి కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ప్రయాణికులు తెలిపారు. 2 గంటలుగా బస్సులు లేకపోవడంతో ఒకేసారి బస్సు రావడంతో ప్రయాణికులు ఎక్కడానికి పోటీపడ్డారు. ఈ సందర్భంలో తోపులాట జరిగి ఒకరి కాళ్లు టైర్ల కింద పడ్డాయి.
Similar News
News July 8, 2025
మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త

ఆగస్టు 15 తర్వాత జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా మహిళలకు బస్సులో ప్రయాణం ఫ్రీ అని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీశైలం మల్లన్న దర్శనార్థం సున్నిపెంటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సమానంగా ఎప్పటికప్పుడు రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తనదే అన్నారు. జులైలోనే అర్హులైన రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు.
News July 8, 2025
పెద్దాపురం: కుటుంబాన్ని దత్తత తీసుకున్న కలెక్టర్

పెద్దాపురం మండలం వడ్లమూరులో పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం దొండపాటి చార్లెస్ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.శ్రీరమణి, తహశీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో డి.శ్రీలలిత పాల్గొన్నారు.
News July 8, 2025
పాడేరు: ‘మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా ఆర్థికాభివృద్ధి’

మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో అల్లూరి జిల్లాలోనే 33 శాతం మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం పాడేరు మండలంలోని ఇరడాపల్లి గ్రామంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలసి మొక్కలను నాటారు. మన జిల్లాలో 35 వేల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు.