News May 1, 2024

మండపేటకు పవన్.. ట్రాఫిక్ దారి మళ్లింపు

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మండపేటలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మండపేటలో పలుచోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు టౌన్ సీఐ అఖిల్ జమ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండపేట రాక సందర్భంగా టౌన్ లోనికి ఏ విధమైన భారీ వాహనాలు రావద్దని కోరారు. వాహనదారులు బైపాస్ రోడ్‌లో వెళ్లాలని సూచించారు.

Similar News

News December 13, 2025

ఈనెల 14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు: SE

image

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ​నిర్వహిస్తున్నట్లు APEPDCL SE కె.తిలక్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు, వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహెూపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.

News December 13, 2025

ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

image

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

News December 13, 2025

డిసెంబర్ 20 నుంచి RTC డోర్ డెలివరీ మాసోత్సవాలు: DPTO

image

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు APSRTC డోర్ డెలివరీ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తూ.గో జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి శనివారం ప్రకటించారు. నగరాలలో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ జరుగుతుందన్నారు. తక్కువ ధరతో వేగంగా.. సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ సౌకర్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.