News November 29, 2024
మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ కామెంట్..?
రైతు బంధుపై మంత్రి తుమ్మల ‘మహబూబ్ నగర్ రైతు పండుగ’ సభలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారు’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తాము రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పల్లకీలో ఊరేగించబోమని, ప్రభుత్వం తరఫున చేయాల్సినంత చేస్తామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలపండి.
Similar News
News December 13, 2024
ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగారన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ఉద్యోగులు మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయని అధికారులు ఇంటికి వెళ్లాల్సి వస్తోందని మంత్రి తుమ్మల హెచ్చరించారు. గతంలో ఎవరి ఒత్తిళ్ల వల్ల తప్పు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని మంత్రి సూచించారు.
News December 13, 2024
మోడల్ నమూనా పనులకు పొంగులేటి శంకుస్థాపన
కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ నమూనా నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదవాడి ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.
News December 13, 2024
ఖమ్మం: అదుపుతప్పిన బైక్.. RMP మృతి
తొమ్మిదో మైలు తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన లక్ష్మణ్ గురువారం రాత్రి ఇల్లందు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో RMP తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన SI సురేష్ పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.