News June 4, 2024
మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ
పుంగనూరులో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుపడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 5,685 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం చల్లా 136 ఓట్ల స్వల్వ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News November 7, 2024
9న తిరుపతిలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్
‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను ఈనెల 9న సా.4:30కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తిరుపతిలోని PGR థియేటర్‌లో టీజర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ నటించిన ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.
News November 7, 2024
విజయపురం కానిస్టేబుల్ మృతి
విజయపురం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తంగరాజ్ అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. నగరి మండలం వేలావడి గ్రామానికి చెందిన తంగరాజు గతంలో పిచ్చాటూరు, నాగలాపురం మండల పోలీస్ స్టేషన్లో పనిచేసి బదిలీపై విజయపురం వచ్చారు. తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్టేషన్ సిబ్బంది, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
News November 7, 2024
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణం
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ఉదయం ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో భానుప్రకాశ్ రెడ్డి, మునికోటేశ్వరరావు, సుచిత్ర ఉన్నారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం ఈవో అందజేశారు.