News August 15, 2025
మంత్రి పొంగులేటితో ఇన్‌ఛార్జి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

భారీ వర్షాలు సహాయక చర్యల నిర్వహణపై మంత్రి పొంగులేటి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ (రెవెన్యూ) తో పాటు టొప్పో పాల్గొన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి టొప్పో వివరించారు.
Similar News
News March 12, 2026
ప.గో: గ్యాస్ పై జేసీ కీలక సూచనలు

జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వదంతులను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దని సూచించారు. సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
News March 12, 2026
తులసీ దళాలతో ఇలా చేస్తే..

ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి తులసి పరిహారాలు మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఎండిన 7 తులసి కొమ్మలను దారంతో కట్టి నెయ్యిలో ముంచి విష్ణుమూర్తి ముందు దీపం వెలిగిస్తే అదృష్టం వరిస్తుంది. ఎండిన ఆకులను గంగాజలంలో కలిపి ఇల్లంతా చల్లితే సానుకూలత పెరుగుతుంది. ఎండిన తులసి కొమ్మను ఎరుపు వస్త్రంలో చుట్టి పర్సులో ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయి’ అని సూచిస్తున్నారు.
News March 12, 2026
ప.గో: వేసవి హెచ్చరిక..

రానున్న వేసవి దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బయటకు వెళ్లరాదని కోరారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, తరచుగా మంచి నీరు, కొబ్బరిబొండాలు సేవించాలని హితవు పలికారు. ఎండలో ప్రయాణించేటప్పుడు టోపీలు ధరించాలని ఆమె పేర్కొన్నారు.


