News June 19, 2024
మంత్రి స్వామిని కలిసిన ప్రకాశం కలెక్టర్

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.
Similar News
News January 22, 2026
ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
News January 22, 2026
మార్కాపురం జిల్లా.. మొదటిసారి రథసప్తమి వేడుకలు

మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం మొదటిసారి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉత్తేజంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనవరి 25వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుందన్నారు. సూర్యప్రభ వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, రజిత రథోత్సవం, చంద్రప్రభ వాహనాలపై చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారన్నారు.
News January 22, 2026
ప్రకాశం: కందికి రూ.8వేలు

కంది కొనుగోలుకు రూ.8 వేలుగా ధరను ప్రభుత్వం నిర్ణయించిందని బేస్తవారిపేట మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు. ఈ విషయాన్ని మండలంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు వివరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. కంది పైరు వేసిన ప్రతి రైతు వారికి సంబంధించిన RSK సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.


