News September 13, 2025

మంథని: ప్రజాసేవలో RTC కొత్త అడుగు..!

image

TSRTC వినూత్న సేవాకార్యక్రమం “యాత్రాదానం”ను ప్రారంభించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. దాతలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరుపేద విద్యార్థులు, దివ్యాంగులు, నిరాశ్రయ వృద్ధులు దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు సందర్శించే అవకాశం పొందుతారు. పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి ప్రత్యేక దినాల్లో ఈ యాత్ర ద్వారా ఆనందాన్ని పంచుకోవచ్చు. బుకింగ్స్‌కు 9959225923, 9948671514ను లేదా డిపోలో సంప్రదించవచ్చు.

Similar News

News December 11, 2025

NRPT: పోలింగ్‌కు ముందు రోజు విద్యా సంస్థలకు సెలవు

image

నారాయణపేట జిల్లాలో రెండో, మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఎన్నికలకు ముందు రోజు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న శనివారం నారాయణపేట, దామరగిద్ద, మరికల్, ధన్వాడ మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుందన్నారు. ఈనెల 16న మంగళవారం మక్తల్, నర్వ, ఉట్కూర్, మాగనూరు, కృష్ణ మండలాల్లో సెలవు ప్రకటించినట్లు చెప్పారు.

News December 11, 2025

ఉప్పల్‌పల్లి సర్పంచ్‌గా ర్యాకం శ్రీనివాస్

image

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి ర్యాకం సంపత్‌పై 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీనివాస్ గెలుపుతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు.

News December 11, 2025

సాలూరు: బంతి పూల సాగు.. బహు బాగు

image

అయ్యప్ప, దుర్గమ్మ మాలదారులు పెరగడంతో పూలకు బాగా గిరాకీ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని సాలూరులో కొంతమంది రైతులు తమకున్న కొద్దిపాటి భూమిలో పూలను సాగుచేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. సాలూరు, పెదబోరబంద, కూర్మరాజుపేట గ్రామాల్లో బంతిపూలు, కనకాంబరం సాగు చేస్తున్నారు. కేజీ బంతి పూలు రూ.100 వరకు ధర ఉందని కూరగాయల సాగు కంటే పూల సాగు వలన కొంత మేర లాభాలు పొందుతున్నామని రైతు శంకరరావు తెలిపారు.