News September 11, 2025
మంథని: మంచి విద్యతోనే మంచి భవిష్యత్తు: మంచు లక్ష్మి

మంథని బాలికల పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్స్ గురువారం ప్రారంభించారు. టీచ్ ఫర్ చేంజ్ ప్రతినిధి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మంథనిలో 6 తరగతులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 51 తరగతులను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News December 15, 2025
అనకాపల్లి: ‘మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్’

మహిళ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ జీవో సంక్రాంతి లోగా జారీ అయ్యేవిధంగా కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు హామీ ఇచ్చారు. ఆదివారం కశింకోట శారదా వనంలో పీఆర్టీయూ నిర్వహించిన వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. పదో తరగతి వంద రోజుల ప్రణాళికలో సెలవులను మినహాయించాలని సూచించారు. సీపీఎస్ రద్దుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ పాల్గొన్నారు.
News December 15, 2025
అమలాపురం: నేడు PGRS కార్యక్రమం

అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ కేంద్రాల్లోని ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
News December 15, 2025
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*TG: రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి.. మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులు
*ఆస్ట్రేలియా సిడ్నీ బీచ్‌లో యూదులపై కాల్పులు.. 12 మంది మృతి
*మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
*మోదీ, షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారన్న రాహుల్ గాంధీ.. ఢిల్లీలో సభ
*అనకాపల్లిలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


