News September 11, 2025

మంథని: విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి: శ్రీధర్ బాబు

image

మంథని పట్టణంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. రూ.80 లక్షలతో ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ శంకుస్థాపన, ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల సహకారం ప్రశంసనీయమని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు.

Similar News

News December 14, 2025

భువనగిరి జిల్లాలో 82.53 శాతం పోలింగ్

image

భువనగిరి, పోచంపల్లి,వలిగొండ, రామన్నపేట, బీబీనగర్ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 82.53 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.

News December 14, 2025

రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త

image

AP: గ్రాట్యుటీ, పెన్షన్ ఇతర బెనిఫిట్స్‌కు దరఖాస్తు ప్రక్రియ గజిబిజిగా ఉండి రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తూ ‘రిటైర్మెంటు బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్’ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అనవసర ప్రక్రియలు తొలగనున్నాయి. ఐటీ సిస్టమ్స్‌ ద్వారా CFMS, పేరోల్ వ్యవస్థలు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (PAG)కి నేరుగా అనుసంధానమై ఉద్యోగులకు మేలు జరగనుంది.

News December 14, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు ఏవీ?

image

ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు ఉపాధి కోసం అధిక సంఖ్యలో వలస వెళ్తుంటారు. వీరంతా సంక్రాంతికి తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. ఇప్పటికే అన్ని రైళ్ల టికెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించలేదు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజా ప్రతినిధులు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.