News August 11, 2025
మందమర్రిలో ఈనెల 12 నుంచి సమావేశాలు

మందమర్రి ఏరియాలోని గనుల విభాగాల్లో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు మల్టీ డిపార్ట్‌మెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు జీఎం దేవేందర్ తెలిపారు. ఈ సమావేశాల్లో భూగర్భగనుల్లో యంత్రాల వినియోగం, 2024-25 సంవత్సరంలో సింగరేణి సాధించిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాలు సింగరేణి పురోగతికి తోడ్పడతాయన్నారు.
Similar News
News March 7, 2026
అల్లు అర్జున్‌తో శిల్పా రవి

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News March 7, 2026
సివిల్స్‌లో సత్తా చాటిన ఇల్లందు బిడ్డ

‘కష్టేఫలి’ అనే మాటకు నిదర్శనంగా నిలిచింది ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించారు.
News March 7, 2026
కరీంనగర్: తమ్ముడే హంతకుడా..?

కరీంనగర్(D) రామడుగు(M)లో ఇటీవల జరిగిన గౌరమ్మను <<19305393>>గొంతు కోసి హత్య <<>>చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని తన తల్లిని తమ్ముడు అనిల్ కుమార్ హత్య చేసి ఉండవచ్చని పెద్ద కొడుకు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


