News March 11, 2025
మందమర్రి: మహిళపై గొడ్డలితో దాడి

మందమర్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అంగడిబజార్ ప్రాంతంలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కందుల కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో మంచినీళ్ల విషయంలో పగిడి రాంబాయి అనే మహిళతో గొడవపడ్డాడు. అనంతరం ఆగ్రహంతో ఆమెపై గొడ్డలితో దాడి చేయగా రాంబాయి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 20, 2026
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News January 20, 2026
వ్యాసుడు చెప్పిన కొన్ని పవిత్ర ధర్మాలు

మూగ జీవులను హింసించకూడదు.
అబద్ధాలు చెప్పకూడదు.
దొంగతనం చేయకూడదు.
ఇతరుల ఆహారం అపహరిస్తే నరకానికి వెళ్తారు.
తెలిసి పాపాలు చేసిన వారు పూజలు చేయకూడదు.
రహస్యాలు రహస్యంగానే ఉంచాలి.
వేదాలను, గురువులను, నిందించరాదు.
కపటం గలవారితో కలిసి పుణ్య కార్యాలు చేయకూడదు.
పర స్త్రీని తల్లిలా భావించి, గౌరవించాలి.
News January 20, 2026
గంగారం మండలానికి డెల్టా ర్యాంకింగ్: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలానికి డెల్టా ర్యాంకింగ్ లభించిందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. నీతి అయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యంతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గంగారం మండలం దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానంలో నిలిచిందని, విద్య, వైద్యం, శానిటేషన్ వివిధ రకాల అంశాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.


