News August 13, 2025

మందమర్రి: రోడ్డుప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మృతి

image

బొక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి మరణించాడని SI రాజశేఖర్ తెలిపారు. మందమర్రికి చెందిన సాయివెంకటేశ్ అనే సింగరేణి ఉద్యోగి తన బైక్‌పై మంచిర్యాలకు వెళ్లి పని పూర్తయ్యాక తిరిగి ఇంటికి వస్తున్నారు. బొక్కలగుట్ట వద్ద ఎలాంటి ఇండికేటర్స్ వేయకుండా ఆపిన లారీని ఢీకొన్నారు. తీవ్ర గాయాలు కావడంతో MNCL ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

Similar News

News March 14, 2026

సూళ్లూరుపేట: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడీ

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

NRPT: జిల్లాలో సిలిండర్ల కొరత లేదు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గృహావసరాలకు విద్యాలయాలకు, ఆసుపత్రులకు సిలిండర్ల సరఫరాలో లోటు రానివ్వమని అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు సెల్స్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. సిలిండర్ల సరఫరాకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు అందించాలని చెప్పారు. యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మకండని సూచించారు.

News March 14, 2026

తిరుపతి: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడి

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు ₹30 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించుకుని పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.