News May 7, 2025

మందమర్రి: వడదెబ్బతో ఒకరు మృతి

image

మందమర్రి పట్టణంలోని అంగడి బజార్‌కు చెందిన వేమూరి కరుణాకర్ అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. పని నిమిత్తం పాత బస్టాండ్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన కరుణాకర్ సాయంత్రం వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. వడదెబ్బతో జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.

Similar News

News February 13, 2026

KMR: ఆరుగురి హత్య.. నిందితుడికి మరణ శిక్ష

image

ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబాన్నే కడతేర్చిన కిరాతక ఘటనలో కామారెడ్డి న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించినట్లు కామారెడ్డి SP రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు మెడిద ప్రశాంత్‌కు మరణశిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. మరో ఇద్దరు నిందితులు గుగులోత్ విష్ణు, మెడిద ఒడ్డెమ్మలకు జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించారు.

News February 13, 2026

వర్ధన్నపేటలో హంగ్.. BRS 6, కాంగ్రెస్ 5

image

వర్ధన్నపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా BRS 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. కాగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 7 ఏ పార్టీ సాధించకపోవడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో వర్ధన్నపేటలో ఏం జరుగుతుందోనని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

News February 13, 2026

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

image

పెద్దపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాన్ని కూడా గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది.