News August 21, 2025
మక్తల్ పట్టణ బంద్ విరమించుకున్న వర్తక సంఘాలు

వర్తక వ్యాపార సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు స్థానికేతర, మార్వాడి గో బ్యాక్ మక్తల్ బంద్ నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు వర్తక సంఘం సభ్యులు ప్రకటించారు. హైదరాబాద్ మోండా మార్కెట్‌లో జరిగిన గొడవను కొందరు అవకాశంగా తీసుకొని వక్రీకరించి లబ్ధి పొందాలని ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్నట్లు వారు గుర్తించారని సంఘం నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర నాయకుల సూచన మేరకు మక్తల్ పట్ట బంద్ విరమించామన్నారు.
Similar News
News January 18, 2026
సీఎం పర్యటనకు ఇందిరమ్మ చీరలతో రాకుంటే జరిమానా!

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు డ్వాక్రా మహిళా సంఘాలను రావాల్సిందిగా అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలతో సీఎం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని లేకుంటే రూ.500, రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. బలవంతంగా పనులు వదిలేసి తాము ఎలా వెళ్లాలని మహిళా సంఘాలు సతమతమవుతున్నారని సమాచారం.
News January 18, 2026
తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.
News January 18, 2026
ట్రంప్ మోసం చేశాడు: ఇరాన్ నిరసనకారులు

US అధ్యక్షుడు ట్రంప్ తమకు ద్రోహం చేశారని ఇరాన్ నిరసనకారులు మండిపడుతున్నారు. దాడికి సిద్ధంగా ఉన్నామని, సాయం త్వరలోనే అందుతుందని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను అణచివేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ‘దేశంలో 15 వేల మంది మరణానికి ట్రంప్ కారణం. మమ్మల్ని ఆయుధాలుగా వాడుకుని మోసం చేశారు. ఖమేనీ ప్రభుత్వంతో డీల్ చేసుకున్నారు’ అని ఆరోపిస్తున్నారు.


