News August 22, 2024
మక్తల్: రుణమాఫీపై నెలకొన్న గందరగోళం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల పట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. మక్తల్ మండల పరిసర గ్రామాల్లోనీ రైతులకు, బ్యాంకు అధికారులు ఒకలా, వ్యవసాయ అధికారులు మరొక లాగా చెప్పడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Similar News
News September 12, 2024
లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి పొంగులేటి
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్వేతారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. శ్వేతా రెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
News September 12, 2024
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లి 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 30.5 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్ 29.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 29.0 ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 29.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News September 12, 2024
శ్రీశైలం జలాశయం రెండు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయంలో 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,38,833 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,24,017 క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని వివరించారు.