News December 2, 2025

మచిలీపట్నం లేదా పెడన నుంచి పోటీకి రెడీ..!

image

జనసేన నాయకుడు కొరియర్ శ్రీను టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను మచిలీపట్నం లేదా పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టికెట్ సమీకరణపై ప్రభావం చూపుతుందనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.

Similar News

News February 11, 2026

రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతే లక్ష్యం: కలెక్టర్

image

మచిలీపట్నంలోని ‘మీ కోసం’ వేదికగా కలెక్టర్ బాలాజీ నేతృత్వంలో రెవెన్యూ అధికారుల సమగ్ర సమీక్ష జరిగింది. జిల్లాలో రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వహించి, ప్రజలకు మరింత జవాబుదారీగా సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా 22-ఏ వివాదాల పరిష్కారం, భూ రీ-సర్వే, ఈ-కేవైసీ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. బాధితుల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు.

News February 11, 2026

కృష్ణా: కొల్లు రవీంద్రకు బెదిరింపు లేఖ.. కార్యకర్తల ఆందోళన!

image

మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్రలకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకు ముప్పు పొంచి ఉందన్న వార్తతో మచిలీపట్నం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న రవీంద్రకు ఇటువంటి హెచ్చరికలు రావడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలని కోరుతున్నారు.

News February 11, 2026

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు – కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనల ప్రకారం తొలి విడతలో 308 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 24న జరిగే సమావేశంలో పరిశీలిస్తామన్నారు. అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.