News February 19, 2025
మణుగూర్: బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి సరోత్తం రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామరాజు అన్నారు. మంగళవారం మణుగూరులో బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు. తమ ప్రచారానికి ఉపాధ్యాయులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. బీజేపి అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు.
Similar News
News April 12, 2026
జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.
News April 12, 2026
ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
News April 12, 2026
ఇంటర్ 2nd ఇయర్‌లో HYD-2లో ఇదీ పరిస్థితి!

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19630797>>HYD<<>>-2లో రెగ్యులర్ విద్యార్థులు 34443 మంది పరీక్షలు రాయగా 24219 మంది పాసై 70.32 శాతంతో స్టేట్‌లో 22వ ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 1868 మందికి 1402 మంది పాసై 75.05%తో 14వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7371 మందికి 1718 మంది పాసై 23.31%తో 35వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 165 మందికి 74 మంది పాసై 44.85%తో 17వ ప్లేస్ వచ్చింది.


