News November 19, 2025
మత్తు పదార్థాల జోలికి యువత పోవద్దు: సీపీ సన్‌ప్రీత్ సింగ్

యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ మెడికల్ విద్యార్థులకు సూచించారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Similar News
News January 22, 2026
సిరివెళ్లలో రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి

సిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫరూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.
News January 22, 2026
కడప జిల్లాలో పురాతన తెలుగు శాసనం గుర్తింపు

సిద్ధవటం మండలం టక్కోలి గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతి జార్జి, కార్య దర్శి శ్రీనివాసులు తెలిపారు. మాచుపల్లి శ్రీ రేణుకా ఎల్లమాంబ దేవాలయాన్ని దర్శించుకున్న వారు టక్కోలి గ్రామానికి చెందిన శివాలయంన్ని సందర్శించగా అక్కడ ప్రాచీన తెలుగు శాసనం ఉందన్నారు.
News January 22, 2026
ఫీడ్ బ్యాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి: కలెక్టర్

ప్రజలకు అందించే సేవలు నాణ్యతను పెంచేందుకు ఫీడ్ బ్యాక్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు అమలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవల్లో పారదర్శకత పెంచాలన్నారు. ప్రజల సంతృప్త స్థాయిలను మెరుగుపరచాలన్నారు.


