News September 11, 2025
మదనపల్లెలో కిలో టమాటా రూ.20

మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు పడి పోయాయి. గురువారం మార్కెట్‌కు 125 మెట్రిక్ టన్నుల టమాటాలు రాగా.. వాటిలో మొదటి రకం 10 కిలోల టమాట బాక్స్ రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. రెండో రకం రూ.180, మూడో రకం రూ.160 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారని మదనపల్లె టమాటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వ్యాపారులు సిండికేటుగా మారి తమని మోసం చేస్తున్నారని టమాటా రైతులు ఆరోపిస్తున్నారు.
Similar News
News December 15, 2025
సిరిసిల్ల: జీపీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యేలు

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 3 మండలాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పట్టు నిలుపుకున్నారు. తంగళ్ళపల్లి మండలంలో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇల్లంతకుంట మండలంలో అత్యధిక సీట్లు గెలుచుకుని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బోయినపల్లి మండలంలో అత్యధిక స్థానాలు దక్కించుకుని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.
News December 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 15, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


