News November 6, 2025
మదనపల్లెలో నిలకడగా టమాటా ధరలు

మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు నిలకడగా ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటి సెక్రటరీ జగదీశ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌కు 165 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకువచ్చారన్నారు. హోల్ సేల్ వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమాటా బాక్స్‌ను రూ.270, రెండవ రకం రూ.250, మూడవ రకం రూ.210 కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. రేట్లు ఇలానే ఉండాలని రైతులు కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
వరంగల్‌కు CGHS వెల్‌నెస్ సెంటర్ మంజూరు: ఎంపీ

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఏడాదిన్నర నిరంతర కృషి ఫలించింది. వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం (Wellness Centre) ఏర్పాటుకు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 22 కేంద్రాలకు వెల్‌నెస్ సెంటర్‌లకు మంజూరు లభించగా, వరంగల్ జిల్లాకు మాత్రమే పూర్తి అనుమతులు లభించాయని, వెల్‌నెస్ సెంటర్‌ను తన ఎంపీ నిధుల ద్వారా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.
News January 16, 2026
పెద్దపల్లి: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: డీసీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పురపాలక సంఘ ఉద్యోగులకు ‘Arrive – Alive’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగం, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగం వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఆదర్శంగా రోడ్డు భద్రత పాటించాలని పిలుపునిచ్చారు.
News January 16, 2026
BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.


