News April 14, 2025

మదనపల్లె: అగ్నిమాపక సేవలు అమోఘం

image

విపత్తుల సమయంలో అగ్నిమాపక సేవలు అద్భుతంగా ఉంటాయని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర తెలిపారు. స్థానిక అగ్నిమాపక కేంద్రంలో సోమవారం చనిపోయిన అగ్నిమాపక సిబ్బంది చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఫైర్ స్టేషన్ అధికారి శివయ్యతో కలసి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ప్రారంభించారు. అనంతరం శకటాల ర్యాలీ జరిగింది. అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయాల్లో ప్రజలకు టక్కున గుర్తొచ్చేది అగ్నిమాపాక అధికారుల అని అన్నారు.

Similar News

News January 24, 2026

HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

image

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

వేములవాడ: మున్సిపాలిటీ నుంచి పంచాయతీకి.. మళ్ళీ పురపాలికగా

image

ఇప్పటి వేములవాడ మున్సిపాలిటీ ఆరు దశాబ్దాల కింద కూడా మున్సిపాలిటీగా ఉండేది. 1965 వరకు మున్సిపాలిటీగా కొనసాగిన వేములవాడను ఆ తర్వాత గ్రామపంచాయతీగా మార్చారు. ఆ తర్వాత మేజర్ పంచాయతీగా మారిన వేములవాడను 2011లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేశారు. 2018లో మూడో శ్రేణి మున్సిపాలిటీగా మార్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న వేములవాడలో ప్రస్తుతం సుమారు 60 వేల జనాభా ఉండగా, 40877 మంది ఓటర్లు ఉన్నారు.