News September 12, 2025

మదనపల్లె: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు

image

ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె రెండవ అదనపు జ్యుడీసియల్ కోర్టు జడ్జి గురువారం తీర్పు ఇచ్చినట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో రెండు ఇళ్లల్లో దొంగతనం చేసిన కేసులో చీకిలగుట్టలో ఉండే కావడి సోమశేఖర్‌ను అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరిగి, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది.

Similar News

News December 12, 2025

పెద్దపల్లి: ఎన్నికల విధుల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసులు జారీ

image

పెద్దపల్లి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 181 మంది ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, నిర్లక్ష్యంగా పనిచేయడంపై ఈ చర్యలు తీసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో 53 మంది పోలింగ్ అధికారులు, 128 మంది ఓపీవోలు ఉన్నారు.

News December 12, 2025

నెల్లూరు: కూతురుపై కాటు వేసిన కామాంధు తండ్రికి యావజ్జీవ కారాగార శిక్ష

image

కన్న కూతురుపై కన్నేసిన ఓ తండ్రి కామంతో కాటు వేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడు చల్లా దశరథకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు వింజమూరు ఎస్సై కే వీరప్రతాప్ తెలిపారు. 2020 లో వింజమూరు బీసీ కాలనీకి చెందిన దశరథ తన కూతురు‌ను బైక్‌పై ఎక్కించుకొని నేరేడుపల్లి గ్రావెల్ రోడ్డు సమీపంలో ఉన్న నిమ్మ తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

News December 12, 2025

అన్ని మతాలకు వాస్తు వర్తిస్తుందా?

image

వాస్తు ఓ మతానికే పరిమితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘వాస్తు పంచభూతాల కలయికపై ఆధారపడిన శాస్త్రం. మతాలు, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవే. పంచభూతాలు మతాలకు అతీతమైనవి కాబట్టి వాస్తు కూడా అతీతమే అవుతుంది. మనం నివసించే ఇంట్లో ఇవి సక్రమంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సవ్యంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లేకపోతే ఆ దుష్ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాస్తు అందరికీ అవసరం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>