News August 1, 2024

మదనపల్లె ఘటనపై CID విచారణ..!

image

మదనపల్లెలో రికార్డుల దగ్ధంపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. భూ బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఈ కేసును CIDకి అప్పగించాల్సిందేనని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు ఉంటారనేది తాను అసలు ఊహించలేదని మదనపల్లెలో అర్జీలు స్వీకరించిన సిసోడియా సీఎంకు చెప్పారు. సీఐడీ విచారణపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

Similar News

News December 13, 2024

చిత్తూరు రైతులకు ఇది తెలుసా?

image

మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.

News December 13, 2024

చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 12, 2024

సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ

image

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.