News November 17, 2025
మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News January 19, 2026
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
News January 19, 2026
కేజీబీవీలకు తాత్కాలిక సారథులు: సీనియర్ టీచర్లు ఇన్‌ఛార్జీలుగా నియామకం

జనగామ జిల్లాలోని కేజీబీవీ బాధ్యతలను తాత్కాలికంగా సీనియర్ టీచర్లకు అప్పగించారు. జిల్లాలోని స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓ) ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 21 ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యాశాఖ అధికారులు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.


