News March 6, 2025
మద్దూరు: ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మద్దూరు మండలం నాగంపల్లి గ్రామ శివారు వాగు నుంచి అర్ధరాత్రి రెండు ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు. బంటు రాజశేఖర్, జోగులాలప్ప పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి ఇసుకను తరలించినందుకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
Similar News
News December 17, 2025
కాలీఫ్లవర్‌లో బట్టనింగ్ లక్షణాలు – నివారణ

కాలీఫ్లవర్‌లో సాధారణ పరిమాణంలో కాకుండా చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నేలలో నత్రజని తక్కువగా అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల బట్టనింగ్ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసు గల నారును మాత్రమే నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వాడాలి. అలాగే స్వల్పకాలిక రకాలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో నాటుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 17, 2025
WNP: 102 అంబులెన్స్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తి జిల్లాలోని 108 అంబులెన్స్‌ల్లో పైలట్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ మహమూద్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎల్‌ఎంవీ (బ్యాడ్జి) లైసెన్స్ ఉండి, 23 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ముఖాముఖికి హాజరుకావాలని ఆయన కోరారు.
News December 17, 2025
సిద్దిపేట జిల్లాలో మూడో విడతలో 88.45% పోలింగ్

సిద్దిపేట జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.45% పోలింగ్ శాతం నమోదైందని అధికారులు తెలిపారు. అక్కన్నపేట-88.06%, చేర్యాల-86.97%, ధూల్మిట్ట-89.70%, హుస్నాబాద్-89.46%, కోహెడ-88.38%, కొమురవెల్లి-87.49%, కొండపాక-89.05%, కుకునూరుపల్లి-91.08%, మద్దూరు-88.24% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.


