News January 25, 2025
మద్దూర్: రూ.13 కోట్ల విలువ చేస్తే ధాన్యం మాయం?

మద్దూరు మండలంలోని రేనివట్ల గ్రామంలో ఓ రైస్ మిల్లు 1,27,000 బస్తాలు వరిధాన్యం మాయమైనట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.13 కోట్లుగా ఉంటుందని అంచనా. రెండు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు ఆ రైస్ మిల్లులో తనిఖీ చేసి లోగుట్టుగా వెళ్లిపోయినట్టు మండల వాసులు చర్చించుకుంటున్నారు. అధికారుల తనిఖీల్లో ధాన్యం బస్తాలు మాయమైనట్లు ఎలాంటి రుజువులు తేలలేదని తెలుస్తోంది.
Similar News
News February 10, 2025
రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ కన్నీళ్లే: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు కన్నీళ్లే మిగిలాయని BRS నేత హరీశ్ రావు అన్నారు. ధర్నా చౌక్ వద్ద RMP, PMPల ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ప్రజలు నమ్మడం లేదని రాహుల్ గాంధీతో బాండ్ పేపర్లు రాయించారు. ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఒక్కటీ అమలు కావడం లేదు. 11 సార్లు ఢిల్లీ వెళ్లినా రేవంత్ సాధించిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
News February 10, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.